‘దృశ్యం 3’ వచ్చేది అప్పుడే

Director Jeethu Joseph,Director Jeethu Joseph Drishyam 3,Director Jeethu Joseph Reveals The Tentative Release Date For Drishyam 3,Drishyam 3,Drishyam 3 Confirmed,Drishyam 3 Film,Drishyam 3 Movie,Drishyam 3 Movie Announced,Drishyam 3 Remake,Drishyam 3 Remake Date,Drishyam 3 Telugu Remake,Drishyam 3 Announcement,Drishyam 3 Telugu Remake Release Date,Drishyam 3 Update,Jeethu Joseph,Jeethu Joseph Confirms Drishyam 3,Jeethu Joseph Latest Film Updates,Jeethu Joseph New Movie,Jeethu Joseph Reveals Release Date For Drishyam 3,Latest Telugu Movies News,Release Date For Drishyam 3,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Drishyam 3 Date

ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ లు ప్లాన్ చేస్తున్నారు ఈమధ్య. కొంతమంది అయితే సినిమా ఎండింగ్ లోనే చెప్పేస్తున్నారనుకోండి. లారెన్స్ ముని సినిమాను కాంచన 4 వరకూ లాగాడు. ఇక ఇప్పుడు దృశ్యం సినిమా కూడా ఆ కోవలోకే వెళుతుంది. జీతూజోసఫ్‌ దర్శకత్వంలో దృశ్యం, దృశ్యం 2 సినిమాలు రాగా ఇప్పుడు దృశ్యం3 కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జీతూ జోసఫ్ దృశ్యం 3 పై క్లారీటీ ఇచ్చేశాడు. దృశ్యం ఫ్రాంచైజీస్ లో
మరో సీక్వెల్ తప్పకుండా ఉంటుందని.. ఇప్పటికే తను దీనికి సంబంధించిన క్లైమాక్స్ కూడా రాసుకున్నానని.. మోహన్ లాల్, నిర్మాత ఆంటోని ఇద్దరూ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారని.. అయితే స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేయాలంటే మూడేళ్లు టైమ్ పట్టొచ్చు అని తెలిపాడు. మరి ప్రస్తుతం జీతూ వెంకీ దృశ్యం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదే అయ్యేసరికీ ఈ ఏడాది అయిపోతుంది. మొత్తానికి జీతూ చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈసినిమా వచ్చే సరికి 2024 కానీ 2025 కానీ అవ్వొచ్చు.

జీతూజోసఫ్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. 2013 డిసెంబ‌ర్ 19న విడుద‌లై అప్ప‌ట్లో కేర‌ళ‌లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌చింది. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =