అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండడం విశేషం. మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం పూర్తిగా కామెడీతో పాటు కాస్త ఎమోషనల్‌గా కూడా ఉంటుందని అర్దమవుతుంది.”పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపిగ్గా, ప్రేమగా కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలొచ్చేసరికి.. పెద్దోళ్లు ఏం చేసినా, ఊరికే చిరాకులు వచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి. నేను కూడా మానాన్నని కాస్త ఓపిగ్గా, ప్రేమగా అడగాల్సింది సార్” అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ లో కామెడీ.. ఎమోషన్, థ్రిల్ ఇలా అన్ని అంశాలు చూపించారు.
అనిల్ రావిపూడి కామెడీ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మార్క్.. ట్రైలర్‌లో కనిపించింది. ఫ.. ఫ.. ఫీ.. ఫా అంటూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే మాటలు, దానిని సత్య వివరించి చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. ఇక కామెడీ తోపాట ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ మరోసారి బలమైన పాత్రతో వస్తున్నట్టు.. తన పాత్ర ఈ సినిమాకు కీలకం అని అర్థమవుతుంది. ఇక విభిన్నమైన సినిమాలు చేయడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు.. ఈ సినిమాను చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. శ్రీవిష్ణుమరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. చూద్దా మరి ఏం జరుగుతుందో..
Fa fa faaa Fun-filled entertainer coming your way..:)
My best wishes to the entire team of #GaaliSampath.https://t.co/7Izn59wpUD#DrRajendraPrasad @AnilRavipudi @sreevishnuoffl @YoursSKrishna #Anish @achurajamani @imagesparkent @Shine_Screens— rajamouli ss (@ssrajamouli) February 27, 2021
కాగా ఈ మూవీని ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై ఎస్. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాలకు కో డైరెక్టర్, రైటర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: