ఇంద్రగంటి-సుధీర్ బాబు సినిమా టైటిల్ అప్ డేట్

Sudheer Babu And Indraganti Mohankrishna New Movie Title To Be Unveiled On 1st March,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sudheer Babu,Actor Sudheer Babu,Director Mohankrishna Indraganti,Sudheer Babu And Indraganti Mohankrishna New Movie Title,Sudheer Babu And Mohankrishna New Movie,Krithi Shetty,Mohanakrishna Indraganti,Sudheer Babu New Movie,Sudheer Babu Movies,Sudheer14​,Sudheer14​ Movie,Sudheer14​ Title,Sudheer14​ Title Reveal On March 1st,Sudheer Babu Upcoming Movie Title,Sudheer Babu New Movie Title On 1st March,Sudheer14​ Title Release Date,Sudheer Babu Next Sudheer14​,#Sudheer14​

ఇంద్రగంటి మోహనకృష్ణ- సుధీర్ బాబు కాంబినేష‌న్ లో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చాడు సుధీర్. అంతేకాదు ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు. ప్రేమ కథలు నచ్చని మనుషులు ఉండరు కదా.. ఎందుకంటే ప్రేమలేని జీవితం ఉంటదు కదా.. అయితే నాలాంటి త‌ను ప్రేమించిన అమ్మాయి గురించి మొట్ట‌మొద‌టి సారి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా మొద‌లు పెడ‌తాడు.. ఇంట్రెస్టింగ్ క‌దా, అయితే అబ్బాయిలంద‌రూ సరదాగా గుర్తుతెచ్చుకోండి.. మొదటిసారి మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఎవ‌రికైన చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు మీరు ఎలా మొద‌లు పెట్టారో చెప్పండి.. నాకు తెలిసీ… చాలా మంది నేను మొద‌లు పెట్టిన‌ట్టే మొద‌లు పెట్టి ఉంటారు. అదెంటో తెలుసకోవాలంటే మార్చి 1 వ‌ర‌కు వెయిట్ చేయండ‌ని సుధీర్ బాబు వీడియో ద్వారా తెలియ‌జేశాడు. మార్చి 1వ తేదీన తన సినిమా టైటిల్ ను రిలీజ్ చేయబోతున్నాడు తెలిపాడు.

కాగా ఈసినిమాలో సుధీర్ బాబు సరసన కృతిశిట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెంచ్‌మార్క్ స్టూడియోస్ నిర్మిస్తోన్న తొలి చిత్రమిది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.