ఒకప్పుడు సినిమాలు అంటే ఇలానే ఉండాలి అన్న కొన్ని ఫార్ములాలు ఉండేవి. కొన్ని సినిమాలు సందేశాత్మకంగా వచ్చినా చాలా వరకూ ఒకే ధోరణిలో నడిచేవి. హీరో హీరోయిన్.. ఫైట్స్.. పాటలు..కామెడీ.. ఇవే ఎలిమెంట్స్ తో కొన్ని వేల సినిమాలు వచ్చాయి ఇప్పటి వరకూ. ఇక క్లైమాక్స్ అయితే కొంచం కూడా తేడా ఉండకూడదు. ఏది ఏమైనా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కలవాల్సిందే. లేకపోతే ఆడియన్సే డిజప్పాయింట్ అవుతారని..అలా లేకపోతే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరని దర్శక నిర్మాతలకి భయం. అందుకే పక్క ఇండస్ట్రీ వాళ్లు ఇలాంటి ధైర్యం చేసినా మనవాళ్లు మాత్రం చేయలేకపోయారు.
కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కూడా మార్పు వస్తుంది. కొత్త కొత్త కథలను తెలుగు తెరపై ఆవిష్కారించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు యంగ్ టాలెంట్ ఎక్కువ వస్తుంది. చిన్న పాయింట్ తోనే సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. దానితో స్టార్ హీరోలు కూడా కాస్త అలోచించి అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కాస్త లేట్ అయినా ఎక్కువ ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికే ఇష్టపడుతున్నారు.
ముఖ్యంగా ఆడియన్స్ ఆలోచనా ధోరణి మారిపోయింది. కొత్తగా ఏది ట్రై చేసినా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి రీసెంట్ గా వచ్చిన ఉప్పెన సినిమానే మరో ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయి మంచి టాక్ తో సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. నిజానికి ఈ సినిమా కథాంశం కూడా మనందరికీ తెలిసిందే. చాలా సినిమాల్లో కూడా చూశాం. అయితే అసలు హైలైట్ మొత్తం క్లైమాక్స్ లోనే. ఇలాంటి క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకుడికి కాస్త కొత్తనే. అయినా కూడా ఆడియన్స్ దానిని రిసీవ్ చేసుకున్నారు.. హిట్ చేశారు. డైరెక్టర్ తన టేకింగ్ తో కన్విన్స్ చేస్తే.. మేము కన్విన్స్ అవుతామని చెప్పకనే చెప్పారు.
ప్రస్తుతం అయితే చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఎన్ని సినిమాలు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయో.. ఎన్ని సినిమాలు డిఫరెంట్ గా వుంటయో. మరి సినిమా అంటే ఒకే ఫార్ములా అని కాకుండా ఇలాంటి విభిన్నమైన ఎన్నో సినిమాలు రావాలని తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి ఇంకా పెరగాలని కోరుకుందాం.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.