ఒకప్పుడు కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించి.. మినిమం గ్యారెంటీ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. కేవలం కామెడీ పాత్రలే కాదు మధ్యలో కొన్ని పాత్ర ప్రధానమైన సినిమాలు చేసి వాటి విజయంలో కీలక పాత్ర కూడా పోషించాడు. ఇక ప్రస్తుతం తన కెరీర్ లో ఎప్పుడు చేయని.. సాహసించని పాత్రతో ఇప్పుడు వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనితో నాంది సినిమాపై కూడా ఇంకా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. క్రాక్ సినిమా నాకు కళ్ళు తెరిపించింది.. జయమ్మ పాత్ర కు వచ్చిన ఇంపాక్ట్ వల్ల టాలీవుడ్ లో చాలా అవకాశాలు వస్తున్నాయి.. నాంది సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తున్నాను… ఈ పాత్ర కూడా మీకు చాల కాలం గుర్తుండి పోతుంది అని ప్రామిస్ చేసి చెపుతున్నా అని తెలిపింది. మరి అది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
ఇంకా ఈ సినిమాలో హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ నాంది అనే చిత్రంతో ఎలా అయిన హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. మరి చూద్దాం ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: