దేవి శ్రీ ప్రసాద్ పాటకు సుక్కూ డ్యాన్స్

Director B Sukumar Dances To The Tune Of Rock Star Devi Sri Prasad,Telugu Filmnagar,Devi Sri Prasad,DSP Music,Rockstar DSP,Devi Sri Prasad Music,Devi Sri Prasad Songs,Devi Sri Prasad Jukebox,DSP Super Hit Songs,Devi Sri Prasad Super Hit Songs,DSP Songs,DSP Live,Devi Sri Prasad Live,Uppena,Uppena Videos,Uppena Songs,Uppena Song,DSP Studio,Devi Sri Prasad Stduio,Ranguladdhukunna Original Composition,Ranguladdhuunna,Ranguladdhukunna Song,Uppena Movie,Devi Sri Prasad Uppena,Uppena Telugu Movie Trailer,Panja Vaisshnav Tej,DSP Ranguladdhukunna Original Composition,Ranguladdhukunna Song Composition,Director Sukumar,#Uppena

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాపై పెరిగిన అంచనాల కారణంగా సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. ఇక సినిమాలో పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే. ఇక ఉప్పెన సినిమాపై అంచనాలు పెరగడానికి టీజర్, ట్రైలర్ తో పాటు ఈ సినిమాలో పాటలు అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. దేవీ శ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన పాటలు మంచి హిట్టయ్యాయి. ఇక నీ కళ్లు నీలి సముద్రం పాట అయితే యూ ట్యూబ్ లో వ్యూస్ తో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో రంగుల‌ద్దుకున్నా పాట కూడా మంచి ఆదరణ పొందింది. ఇక తాజాగా దేవి పాడిన పాటను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. బుచ్చిబాబు, డీఎస్పీ, చంద్ర‌బోస్ రికార్డింగ్ రూంలో ఉండ‌గా గిటార్ వాయిస్తూ పాట పాడుతుంటే మధ్యలో డైరెక్ట‌ర్ స‌కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో దేవి పాటకు సుకుమార్ నాలుగు స్టెప్పులు వేసాడు. ఇప్పుడు ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.