వాళ్ల వల్లే హీరో అయ్యాను

Vaisshav Tej Reveals About His Inspiration Behind Choosing Films As His Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Panja Vaisshnav Tej,Vaisshnav Tej,Actor Vaisshnav Tej,Hero Vaisshnav Tej,Chiranjeevi,Actor,Chiranjeevi Mega Star Chiranjeevi,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Actor Pawan Kalyan,Vaisshnav Tej Encouraged By Chiranjeevi And Pawan Kalyan To Act,Mega Family,Vaisshnav Tej About His Acting,Uppena,Uppena Movie,Uppena Movie Trailer,Uppena Telugu Movie Trailer,Panja Vaisshnav Tej Latest News,Vaisshav Tej About His Inspiration,Vaisshav Tej About His Film Career

మెగా కాంపౌండ్ నుండి వస్తున్న మరో నటుడు వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఇక మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ చుసిన తర్వాత సినిమా పక్కా హిట్ అన్న టాక్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో మాత్రం తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమా రిలీజ్ దగ్గర్లోనే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్. మొదటినుండి తనకు నటన మీద ఆసక్తి లేదని..డైరెక్టర్ అవుదామనుకున్నా… ఫొటోగ్రాఫర్ అవుదామని అనుకున్నా. కోర్సు కూడా చేశాను.. రేసర్, ఆస్ట్రోనాట్, 2డి డిజైనర్, 3డి యానిమేటర్ ఇలా చాలా ట్రై చేశా. ఏదీ కుదరలేదు.ఫైనల్ గా ఆర్మీ లోకి వెళదామనుకున్నా.. అందుకోసం కాస్త వెయిట్ కూడా తగ్గాను అప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి.. ఒకరిద్దరు డైరెక్టర్స్ కూడా అడిగారు.. అయితే బుచ్చిబాబు కథ నచ్చడంతో విన్నాను..

ఇక చిరంజీవి మామ.. కళ్యాణ్ మామ మాత్రం చిన్నప్పటినుండి నన్ను బాగానే ప్రోత్సహించేవారు అని తెలిపాడు. అవకాశాన్ని గౌరవించాలని చెప్పారు. అవకాశం కోసం చాలా మంది బయట ఎదురుచూస్తున్నారని.. నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని అన్నారు. ఒకసారి ట్రై చేసి చూడు నీ వల్ల కాకపోతే వదిలేయ్ అన్నారు. కళ్యాణ్ మామ సినిమా ‘జానీ’లో నేను చేశాను. నా కళ్లు అంటే చాలా ఇష్టం. సినిమాలో నటిస్తావా అని అడిగారు. చేస్తా అన్నాను అందుకు బొమ్మలు కూడా కొనిచ్చారు.. ఇక ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో నటించాను. అలాగే, ‘అందరివాడు’లో కూడా చేశాను. నేను ఏదీ కావాలని చేయలేదు.. అలా జరిగిపోయింది.

ఇక ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు అన్నీ చాలా బాగా కలిసొచ్చాయి.. డైరెక్టర్, విజయ సేతుపతి లాంటి నటుడు.. మైత్రి మూవీస్ లాంటి బ్యానర్.. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి… హీరోయిన్ గా కృతిక ఇలా ప్రతి ఒక్కటీ చక్కగా కుదిరాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నామని చెప్పాడు. చూద్దాం మరిఉప్పెన వైష్ణవ్ కెరీర్ కు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.