సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది నుండి ఎదురుచూస్తున్నాడు వైష్ణవ్ కూడా. ఫైనల్లీ థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. ఇంకో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, పోస్టర్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టు వైష్ణవ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ మరింత ఆకట్టుకొని ఆ అంచనాలను రెట్టింపు చేసింది. హీరో, హీరోయిన్ నటన బావుందని.. సినిమాలో కొత్తదనం కనిపిస్తోందన్న ప్రశంసలు దక్కాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy to present #UppenaTrailer.
Good luck my brother Vaisshnav. https://t.co/eM2FR6NMRyBest wishes to producers @MythriOfficial and director Buchi @BuchiBabuSana , @IamKrithiShetty, versatile actor @VijaySethuOffl Garu and @ThisIsDSP!
— Jr NTR (@tarak9999) February 4, 2021
కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: