‘డియర్ మేఘ’ ఫస్ట్ లుక్ రిలీజ్

Dear Megha Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rana Daggubati Unveils Dear Megha First Look,Rana Daggubati,Dear Megha Movie First Look,Motion Poster,Megha Akash,Dear Megha,Dear Megha Motion Poster,Dear Megha First Look,Dear Megha Teaser,Dear Megha Official Teaser,Dear Megha Telugu Movie First Look,Megha Akash Movies,Actress Megha Akash,Dear Megha First Look Is Out,Dear Megha Movie First Look Unveiled,Dear Megha Movie First Look Released,Dear Megha Movie,Megha Akash Dear Megha First Look

‘చల్ మోహనరంగ, లై’ సినిమాలతో ఆకట్టుకున్నా సరైన హిట్ అందుకోలేకపోయింది నటి మేఘ. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్స్ లు కూడా రాలేదు. అయితే ఈ గ్యాప్ లో తమిళ్ లో సినిమాలు చేసింది. వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ ఈ అమ్మడు మాత్రం ఇప్పటివరకూ సక్సెస్ టేస్ట్ మాత్రం చూడలేకపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం మేఘ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ‘డియ‌ర్ మేఘ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా చేస్తుంది. అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. హీరో రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా తన సోషల్ మీడియా లో ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే….. మేఘ ఆకాష్ ఉద్వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక కంటిలో నుంచి కన్నీరు రావడం కనిపిస్తోంది. ఈ సినిమాలో మేఘా ఆకాష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. ఆమె కన్నీటికి కారణం ఎవరు, ఈ ఉద్వేగ పరిస్థితి ఎందుకొచ్చింది అనేది “డియర్ మేఘ” సినిమాలో తెలియనుంది.

కాగా ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఐ ఆండ్రూ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 15 =