నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా మహానటి సినిమా మాత్రం కీర్తి సురేష్ కు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘మహానటి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో జాతీయ అవార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్. ఇక మహానటి తర్వాత వరుస ఆఫర్స్ ను అందిపుచ్చుకుంటున్న కీర్తి అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోపక్క కమెర్షియల్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తుంది. గత ఏడాది లాక్ డౌన్ వల్ల థియేటర్స్ లేకపోయినా.. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసి సందడి చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా కీర్తి సురేష్ మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా `థర్టీ అండర్ థర్టీ` పేరుతో 30 ఏళ్లలోపు ప్రతిభావంతులైన 30 మంది జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో కీర్తి చోటు దక్కించుకుంది. ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో కీర్తికి చోటు లభించింది. దీనితో సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది కీర్తిసురేష్. ప్రతిష్టాత్మక జాబితాలో చోటుదక్కించుకున్నందుకు గర్వంగా ఉందని చెబుతూ ఫోర్బ్స్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది.
Honored to be one among the different walks of fame in the #ForbesIndia30U30. Thank you so much @forbes_india. Humbled 🙏🏻😊 https://t.co/1XIbARcDEX
— Keerthy Suresh (@KeerthyOfficial) February 3, 2021
కాగా కీర్తి సురేష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: