‘వాలెంటైన్స్ డే’ కి రాధే శ్యామ్ టీజర్..?

Radhe Shyam Movie Teaser To Release On Valentines Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas,Rebel Star Prabhas,Hero Prabhas,Actor Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Film,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Telugu,Radhe Shyam Teaser Update,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Radhe Shyam Teaser News,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Teaser,Radhe Shyam Teaser For Valentines Day,Pooja Hegde,Prabhas Fans,Radhe Shyam Teaser On Feb 14,Radhe Shyam Teaser on Valentines Day

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పూజా హెగ్డే తన షూట్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, పూజా హెగ్డే ప్రేర‌ణ అనే పాత్ర‌తో నటించనున్నారు. ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈటీజర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి అప్ డేట్ ఇస్తానని డైరెక్టర్ ప్రామిస్ చేయడంతో ఇప్పుడు ఆ అప్ డేట్ టీజర్ గురించి ఉంటుందేమో అన్న టాక్స్ వినిపిస్తున్నాయి. వాలెంటైన్స్ డే రోజు టీజర్ రిలీజ్ చేస్తారేమో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి టీజర్ అంటే కాస్త ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టే. మరి చూద్దాం ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ప్రేమికుల రోజున ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో..

కాగా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణం రాజు కూడా ఓ కీల‌క పాత్రలో నటిస్తున్నాడు.
తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.