రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో ‘ఈశ్వర్’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. మొదటి సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర సినిమా కూడా విజయం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమా ప్రభాస్ కెరీర్ నే మార్చేసింది. అదే వర్షం సినిమా ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన ‘వర్షం’ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రశంసల వర్షాన్ని, కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపించింది. ఆ తరువాత అడవిరాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ను మార్చేసింది. మాస్ హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సాధించింది. ఆ తరువాత పౌర్ణమి, యోగి, మున్నా ఈ మూడు ఫెయిల్ కాగా, పూరి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనంతరం వచ్చిన రెండు సినిమాలు బిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు ఫెయిల్ కాగా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు వరసగా హిట్ కొట్టాయి. దీనితర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సీరీస్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదు. బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు సాధించాయి. పాన్ ఇండియాగా వచ్చిన సాహో సినిమా కూడా మంచి విజయం దక్కించుకుంది. ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. రాధా కృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’, నాగ్ అశ్విన్ తో ఒక సినిమా, ఓం రౌత్ తో ‘అది పురుష్’, ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ సినిమాలు చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి తన సినీ కెరీర్ లో ఇప్పటివరకూ ఎంతో మంది హీరోయిన్స్ తో నటించాడు. మరి ప్రభాస్ కు బెస్ట్ జోడి ఎవరో మీ ఓటు ద్వారా తెలపండి.
[totalpoll id=”55755″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: