2020 లో కరోనా వల్ల అన్ని పరిశ్రమలు దాదాపు చాలా వరకూ నష్టపోయిన సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమ. చాలా పరిశ్రమలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ వుంది కానీ సినీ పరిశ్రమకు పరిస్థితి వేరు. షూటింగ్ లు జరిగితేనే సినీ కార్మికులకు ఆదాయం. మరి లాక్ డౌన్ లో సినీ పరిశ్రమ ఎలాంటి గడ్డుకాలం చూసిందో మనం కూడా చూసాం. షూటింగ్ లు లేవు.. మరో పక్క థియేటర్స్ మొత్తం మూత పడ్డాయి.. వేల కోట్లలో బిజినెస్ ఆగిపోయింది. ఎలాగొలా ఇప్పుడిప్పుడే ఆ నష్టం నుండి తేరుకుంటుంది. గత రెండు నెలల నుండి షూటింగ్ లు జరుగుతున్నాయి.. సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు సినీ పరిశ్రమకు మరో గుడ్ న్యూస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. థియేటర్స్ తెరిచినా ఇప్పటివరకూ 50 శాతం అక్యుపెన్సీ తో నడిపించాలనే షరతులు ఉన్నాయి. ఆ మధ్య సంక్రాంతి పండుగ సీజన్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సీటింగ్ కెపాసిటీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా వంద శాతం థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోమని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పుడు తాజాగా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది
అన్‌లాక్ 5.0 నిబంధనల ప్రకారం అధిక శాతం ఆక్యుపెన్సీతో సినీ థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చునని కేంద్ర సమాచార, ప్రసార మాధ్యమాల మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. అయితే ఎంత శాతంతో థియేటర్స్ బుక్ చేసుకోవచ్చుననే సంగతిని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరి 1 నుంచి థియేటర్స్ యజమాన్యం అధిక శాతంతో థియేటర్స్‌కు ప్రేక్షకులను అనుమతించవచ్చును. మరి ఒక రకంగా సినీ పరిశ్రమకు కాస్త ఊరట కలిగించే వార్తే. మరి గతంలో లాగ పూర్తి శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ప్రేక్షకులు సినిమాలతో కళకళలాడాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: