అఫీషియల్.. ‘సలార్’ లో ‘శృతి’

Makers Of Salaar Movie Officially Welcomes Shruti Haasan On Board,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Haasan Joins Prabhas Starrer Salaar,Shruti Haasan Is The Leading Lady Of Prabhas Starrer Salaar,Shruthi Haasan,Actress Shruthi Haasan,Prabhas,Rebel Star Prabhas,Actor Prabhas,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Shruthi Haasan Joins Salaar,Shruthi Haasan In Salaar,Happy Birthday Shruthi Haasan,Hombale Films,Shruti Haasan On Board For Prabhas Salaar,#HBDShrutiHaasan,#Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలను తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో తెరకెక్కించనున్నట్టు.. ఇప్పటికే కోల్ మైన్ వద్ద ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్న విషయంపై పలు పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసారు చిత్రయూనిట్. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారు. ఈ రోజు శృతి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా హోంబలే ఫిలిమ్స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా శృతికి బర్త్ డే విషెస్ చెపుతూ ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నట్టు ప్రకటించారు.

మరి చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే క్రాక్ తో రీఎంట్రీ ఇచ్చిన శృతి ఆ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. చూద్దాం మరి ఈసినిమాతో ఈ భామ రేంజ్ ఎంత పెరిగిపోతుందో.

కాగా ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటిస్తున్నట్టు తెలుస్తుంది. తదితరుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 1 =