సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియనుమ్’ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో రానా నటిస్తున్న సంగతి కూడా విదితమే. బిజు మీనన్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా సాయి పల్లవి తో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు
ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. దిల్ రాజు- బోనికపూర్ సంయుక్తంగా ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: