చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు ఉండగా వాటిలో గ్యాంగ్ లీడర్ సినిమా కూడా తప్పకుండా ఉంటుంది. చిరంజీవి హీరోగా నటించగా మురళీ మోహన్, తమిళ్ నటుడు శరత్ కుమార్ అన్నలుగా నటించారు. ఆ ముగ్గురి అన్నదమ్ముల అనుబంధం.. చిరు పర్ఫార్మెన్స్, విజయశాంతి తో కెమిస్ట్రీ చిరు-నిర్మలమ్మ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఎప్పటికీ మరచిపోలేము. ఇక బప్పీలహరి సంగీతం అందించిన ఈ సినిమాకు మరో హైలైట్. విజయ బాపినీడు దర్శకత్వంలో, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 1991 లో మే న రిలీజై ఈ ఏడాది మే 9 కి 30 ఏళ్ళు పూర్తి చేసుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి ఇప్పుడు ఈ సినిమా గురించి ఈ ప్రస్తావన ఎందుకంటే..దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఈ అన్నదమ్ముళ్లు మళ్లీ ఒక ఫ్రేమ్ లో కనిపించారు. గ్యాంగ్ లీడర్ లో మురళీ మోహన్, శరత్ కుమార్, చిరంజీవి లు రఘుపతి.. రాఘవ.. రాజారామ్‌లుగా అన్నదమ్ములుగా నటించారు. తాజాగా మురళీ మోహన్, శరత్ కుమార్ లు చిరు ని కలిశారు.
ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య షూటింగ్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కు మురళీ మోహన్, శరత్ కుమార్ వెళ్లి చిరును కలిశారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో ఫొటోతో తాజాగా చిరుతో మురళీ మోహన్, శరత్ కుమార్ తీసుకున్న ఫొటో జతచేసి పోస్ట్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: