మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “, సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “రెండు మూవీస్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆచార్య “మూవీ భారీ టెంపుల్ టౌన్ సెట్ , “రౌద్రం రణం రుధిరం “మూవీ క్లైమాక్స్ షూటింగ్స్ లో రామ్ చరణ్ ఒకేసారి పాల్గొంటున్నారు. హీరో రామ్ చరణ్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడం తో కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. పగలు ఒక మూవీ షూటింగ్ లో , రాత్రి ఒక మూవీ షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నట్టు సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో “రౌద్రం రణం రుధిరం “, చిరంజీవి కాంబినేషన్ లో “ఆచార్య ” లో రామ్ చరణ్ నటిస్తుండడం తో రెండు మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ సోలో హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: