గుణశేఖర్ పౌరాణిక కథాంశంతో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే శాకుంతల పాత్రలో అక్కినేని కోడలు నటించనున్నట్లుగా ప్రకటించాడు గుణశేఖర్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి గత కొద్దిరోజులుగా ఒక రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శకుంతల పాత్రలో సమంత చేయనుండడంతో.. సమంత లాంటి స్టార్ నటి సరసన దుష్యంతుడి పాత్రలో ఏ హీరో నటిస్తాడని విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దుష్యంతుడుగా రానాతో పాటు పలువురు ప్రముఖ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో ఈ రూమర్లపై స్పందించిన గుణశేఖర్ వాటిపై క్లారిటీ ఇచ్చారు. సమంత మినహా మిగతా పాత్రల్లో నటించబోయే నటీనటుల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇతరుల పేర్లను ప్రచారం చేయవద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త్వరలోనే మిగిలిన నటీనటుల వివరాలు తెలియచేయనున్నారు.
కాగా పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిచనున్నాడు.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత గుణశేఖర్ రానాతో `హిరణ్యకశ్యప`సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. ఈ సినిమాను ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఎప్పుడో పూర్తయింది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: