దాదాపు ఎనిమిది నెలలు వరకు థియేటర్ మొహం చూసే అవకాశం కోల్పోయారు సినీ లవర్స్. అప్పుడప్పుడు సినిమా చూసే వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఉండకపోయినా సగటు సినీ ప్రేక్షకుడికి మాత్రం ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది. ఎన్ని ఆన్ లైన్ సైట్ లు ఉన్నా.. ఎన్ని ఓటీటీ వేదికలు ఉన్న థియేటర్ లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. ఇక లాక్ డౌన్ తరువాత థియేటర్స్ కూడా ఎలాగోలా తెరుచుకున్నాయి. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో జనాలు మెల్లగా థియేటర్స్ కు అలవాటు పడుతున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా థియేటర్స్ కు వచ్చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి చెపుతూ తన ఇన్స్టాలో ఎగ్జైటింగ్ గా పోస్ట్ పెట్టింది. చాలా రోజుల తర్వాత థియేటర్ కు రావడం హ్యాపీ గా ఉంది.. ఆ ఫీలింగ్ గురించి చెప్పడం కష్టం.. మాస్టర్ సినిమా చూస్తున్నట్టు పోస్ట్ లో పేర్కొంది.
View this post on Instagram
కాగా కీర్తి సురేష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. దానితో పాటు మరో తమిళ్ సినిమా కూడా చేస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: