కార్తీక్ సాయి ‘సైకో’ టీజర్ రిలీజ్

Pyscho Telugu movie teaser out now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,latest telugu movies news, Latest Tollywood News, Psycho, psycho movie, Psycho Movie Latest News, Psycho Movie Teaser, Psycho Movie Updates, Psycho Official Teaser, psycho teaser, Psycho Teaser: Twists And Turns Promise A Thriller Story Experience, psycho telugu movie, Psycho Telugu Movie Latest News, Psycho Telugu Movie Live Updates, Psycho Telugu Movie Teaser, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates

చిన్నా దర్శకత్వంలో కార్తీక్ సాయి, డాలీషా, నేహా దేశ్ పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ”సైకో”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ టీజర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అల్లుడు అదుర్స్ సినిమా నిర్మాతలు గొర్రెల సుబ్రమణ్యం, గంజి రమేష్, సురేష్ కొండేటి లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ .. మా కార్తీక్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ ఇలాంటి ఫీలింగ్ క్రియేట్ చేయగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఉన్నట్టు కనిపిస్తుంది. కొత్తగా ఉంటేనే ఎవరైనా అంగీకరిస్తారు. ఈ కరోనా సమయంలో ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక ఇంత గ్రాండ్ గా చేయడం నిజంగా గొప్ప విషయం. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి, నిర్మాతలకు బాగా డబ్బులు రావాలి, హీరోగా కార్తీక్ కూడా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

కాగా శ్రీమతి లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు, సంకినేని వాసుదేవ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఆర్యన్, మ్యూజిక్ డైరెక్టర్ గా సిద్దార్ వాట్కిన్ పనిచేస్తున్నారు. సీవిఎల్ నరసింహ, సంధ్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.