శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ -తమన్నా , వరుణ్ తేజ్ -మెహరీన్ జంటలుగా రూపొందిన “F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోలు వెంకటేష్ , వరుణ్ తేజ్ లు తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. “F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ని
దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశేష ప్రేక్షకాదరణ పొందిన “F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 :ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ డిసెంబర్ 17 వ తేదీ పూజాకార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని కొండాపూర్ లో రూపొందించిన ఒక స్పెషల్ సెట్ లో ఈ రోజు (23 వ తేదీ) ప్రారంభం కానుంది. “F 3 :ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ లో హీరో వెంకటేష్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “F 3 :ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ లో వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో కూడా నటిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: