‘ఖిలాడి’ కోసం భారీ జైలు సెట్

A Big Jail Set for Ravi Teja's Khiladi,2020 Telugu Movies News, Khiladi, Khiladi Movie, Khiladi Movie Shooting Updates, Khiladi Shooting News, Khiladi Telugu Movie, Khiladi Telugu Movie Shooting Latest News, Khiladi: Ravi Teja Shooting For A High Voltage Action Sequence In Hyderabad, latest telugu movies news, Latest Tollywood News, Mass Maharaja Ravi Teja Latest News, Telugu Filmnagar, Telugu Movies Updates, Tollywood Movie Updates

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ నే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం భారీ జైలు సెట్ ను ఏర్పాటు చేస్తున్నారట. ఇక్కడే భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారట. కె.జి.ఎఫ్ 2 కోసం యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసిన అన్బు ఆరివ్.. ఈ సినిమా కోసం యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు.

కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫ‌ర్’ ఫేమ్ సుజిత్‌ వాసుదేవ్ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు.

మరి ‘రాక్ష‌సుడు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో త‌మ‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అని స‌త్య‌నారాయ‌ణ కోనేరు, ర‌మేష్ వ‌ర్మ నిరూపించారు. ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రాన్ని ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో, ఉన్న‌త ప్ర‌మాణాల‌తో తీస్తున్నారు. చూద్దాం మరి ఈసినిమా కూడా అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందో..లేదో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.