మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రీమేక్‌లో పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్ నటిస్తున్నాడు. పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటించనున్నాడు. ఇక ఈ సినిమాను నిన్ననే లాంఛనంగా ప్రారంభించింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో రానా కు తండ్రిగా తమిళ్ టాలెంటెడ్ నటుడు సముద్ర ఖని నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పాత్రకు సముద్ర ఖని అయితేనే కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
కాగా రవితేజ నటించిన ‘శంభో శివ శంభో’(2010), నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెండాపై కపిరాజు’(2014)… సముద్రఖని దర్శకత్వంలోనే రూపొందాయి. దర్శకుడిగానూ, నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని… తెలుగులో ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది అల వైకుంఠపురములో సినిమాలో కీలక పాత్రలో నటించగా.. ఇప్పుడు పలు సినిమాతో వచ్చేస్తున్నాడు. ఓ వైపు దర్శకుడిగా రాణిస్తూనే, మరోవైపు నటుడిగానూ సినిమాలు చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: