బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా నటేష్ కథానాయికగా రూపొందిన “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న “అల్లుడు అదుర్స్ ” మూవీ లో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” తెలుగు రీమేక్ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ , నభా నటేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్ సోమవారం మీడియా తో సమావేశమయ్యారు. నభా నటేష్ మాట్లాడుతూ .. తాను ఎంపిక చేసుకున్న ప్రతీ సినిమా వైవిధ్యం గా ఉండాలని కోరుకుంటాననీ, “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీలో తన పాత్ర వినోదం , భావోద్వేగాల మిళితంగా ఉంటుందనీ, ఆధునిక భావాలున్న యువతి (అమృత )గా నటించాననీ, హీరో సాయి తేజ్ , తన కెమిస్ట్రీ భిన్నంగా ఉంటుందనీ , తన తొలి సినిమా “నన్ను దోచుకుందువటే”కి దర్శకుడు సుబ్బు రచనా విభాగం లో పనిచేశారనీ, కథ తో పాటు , తన పాత్ర నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాననీ, “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ థియేటర్స్ లో రిలీజ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాననీ, చిత్ర సీమ లో సక్సెస్ కు దగ్గర దారేదీ లేదనీ , కష్ట పడితేనే విజయాలు వరిస్తాయనీ, తన రంగస్థల అనుభవం పాత్రల మధ్య వైవిధ్యం ప్రదర్శించడానికి ఉపయోగపడుతుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: