ఒక పక్క కరోనా ప్రభావం తగ్గుతున్నా.. మరోపక్క సెలబ్రిటీస్ మాత్రం కరోనా బారిన పడుతూనే వున్నారు. నిజం చెప్పాలంటే సామాన్య ప్రజలకంటే సెలెబ్రిటీసే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే కరోనాకు గురవుతున్న సెలబ్రిటీస్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్పా.. తగ్గట్లేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో టాప్ హీరోయిన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.`నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండ`ని రకుల్ ట్వీట్ లో పేర్కొంది.
😊💪🏼 pic.twitter.com/DNqEiF8gLO
— Rakul Singh (@Rakulpreet) December 22, 2020
ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న ‘చెక్’ సినిమాలో కూడా నటిస్తుంది. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: