వరుస హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో బిజీగా వున్నాడు. వెంకటేష్, వరుణ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 సినిమా దిల్ రాజుకు దాదాపు 50 కోట్లకు పైగానే లాభాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏఫ్3 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సినిమా చేయడానికి రాబోతున్నాడు. నిన్ననే ఈ సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేసారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో వెంకీ, వరుణ్‌తో పాటు మరో హీరో కూడా నటిస్తాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే రవితేజ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ చేస్తున్నారని.. వాళ్లకు జోడీగా తమన్నా, మెహ్రీన్ కంటిన్యూ అవుతున్నారని కన్ఫర్మ్ చేసాడు. రూమర్స్ ఏవీ నమ్మొద్దని.. కేవలం వెంకీ, వరుణ్ తప్ప మరో హీరోలు లేరని చెప్పేసాడు అనిల్ రావిపూడి. డిసెంబర్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి.. వచ్చే ఏడాది సమ్మర్ లోపు పూర్తి చేయాలని చూస్తున్నాడు అనిల్.
కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక F2 లో నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: