‘టక్ జగదీష్’ – ‘ఫస్ట్ లుక్’ కు డేట్ ఫిక్స్

Date Locked For Tuck Jagadish First Look Launch, Director Shiva Nirvana, Nani New Movie Updates, Nani Next Movie Tuck Jagadish, Nani Starrer Tuck Jagadish, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Tuck Jagadish First Look, Tuck Jagadish First Look Launch, Tuck Jagadish First Look Launch Date, Tuck Jagadish Movie Latest News, Tuck Jagadish Shooting Updates, Tuck Jagadish Telugu Movie

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా..  ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఇటీవలే చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ లో నాని లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

కాగా ‘నిన్నుకోరి’ వంటి హిట్ సినిమా తర్వాత నాని – శివ నిర్వాణ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందా లేదా చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =