బిగ్ బాస్ 4 – కంటెస్టెంట్ల ఎమోషనల్ జర్నీ

#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, Bigg Boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Telugu Day 103, Bigg Boss 4 Telugu Day 103 Highlights, Bigg Boss 4 Telugu Highlights, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu 4 Contestants, Bigg Boss Telugu 4 Contestants get Emotional watching their Journey, Bigg Boss Telugu 4 Highlights, Bigg Boss Telugu Season 4, Bigg Boss Telugu Season 4 Latest News, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బిగ్ బాస్ 4 – ముగింపుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇక కొన్ని గంటలు మాత్రమే ఉంది ఈ సీజన్ ముగియడానికి. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు ఉండగా అభి, అఖిల్ ల జర్నీ ల వీడియోలను చూపించగా.. ఈరోజు మిగిలిన ముగ్గురు జర్నీల వీడియోలను చూపించారు. ఇక ఈ రోజు ఎవరి జర్నీ లో ఏం చూపించారు.. ఎవరికి ఎలాంటి ప్రశంసలు దక్కాయి లాంటి విషయాలు తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు ముందుగా హారిక వీడియోను చూపించాడు బిగ్ బాస్. ఈ ప్ర‌యాణంలో ప్ర‌త్యేకంగా నిలిచార‌ని, ఎవ‌రి స‌పోర్ట్ లేక‌పోయినా ప‌ట్టుద‌ల‌, మొండిద‌ల‌తో ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చార‌ని బిగ్‌బాస్ అభినందించాడు. చిన్న ప్యాకెట్ పెద్ద ధ‌మాకా అన్న వాక్యాన్ని నిజం చేస్తూ ఫైన‌లిస్టుగా నిలిచార‌ని చెపుతాడు. అలాగే త‌ను చేసిన అల్ల‌రి, టాస్కుల‌ను అన్నింటినీ చూపించ‌డంతో భావోద్వేగానికి లోనైంది. ఇక త‌న జ‌ర్నీ చూసి ఈ బిగ్‌బాస్ ప్ర‌యాణం త‌న‌కు గొప్ప అనుభ‌వ‌మ‌ని చెప్పుకొచ్చింది. 14 వారలు చాలా ఫాస్ట్ గా అయిపోయాయి.. ప్రతి రోజు ఒక లెర్నింగ్ డే ఇక్కడ ఫైట్ చేయడం నేర్పించారు…అలేఖ్య హారిక లైఫ్ హిస్టరీ తీస్తే బిగ్ బాస్ ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది.. నా ఫైట్ పూర్తయింది అని తెలిపింది.ఇక ఆ తర్వాత సోహెల్ జర్నీకి సంబందించిన వీడియోను చూపించాడు. మీరు అన్ని భావోద్వేగాల‌ను చూపించార‌ని.. స్నేహం అనే ప‌దానికి కొత్త అర్థాన్ని సృష్టించార‌ని మెచ్చుకున్నాడు. ఆట ప‌ట్ల తాప‌త్ర‌యానికి బిగ్‌బాస్ సెల్యూట్ చేశాడు. మీ శ్ర‌మ‌, ప్ర‌తిభ ఊరికే పోద‌ని, ఇకపై మీ క‌థ వేరేలా ఉంటుంద‌ని సోహైల్ డైలాగ్‌ ను చెప్పాడు. అనంత‌రం అత‌డి జ‌ర్నీ వీడియోను చూపించ‌గా … అందులో బాధ‌, కోపం, స్నేహం, ప్రేమ అన్నింటినీ చూపించడంతో సోహైల్ కంట‌త‌డి పెట్టుకున్నాడు. ఆ తర్వాత సోహెల్ నా సినిమాకు నేనే టికెట్టు కొనుక్కునేవాడిని. నా సినిమాకు 20 మంది కూడా రాలేద‌ని హేళ‌న చేసేవారు. కానీ ఇప్పుడు న‌న్ను బిగ్‌బాస్‌లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు నేను సినిమా చేస్తే ప్రేక్ష‌కులు హిట్ కొడ‌తార‌ని ఆశిస్తున్నా. ప‌ది సంవ‌త్స‌రాల క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం 105 రోజుల్లో ఇచ్చార‌న్నాడు. ట్రోఫీ రాక‌పోయినా మ‌నసుకు సంతోషాన్నిచ్చారు, అది చాలంటూ ఎమోషనల్ అయ్యాడు.

ఫైనల్ గా అరియానా వీడియోను చూపించారు. ఇక అరియానా గురించి బిగ్‌బాస్ చెపుతూ.. మీరొక సంచ‌ల‌నం అని… సొంత నియ‌మాల‌తో సొంత ఆట‌ను ఆడార‌ని, కానీ కొన్నిసార్లు ఒంట‌రయ్యార‌ని.. అయినా కూడా అడవి గుర్రంలాగా దూసుకెళ్లారని చెప్పాడు. అంతేకాదు.. ఆమెకు బిగ్ బాస్ షైనింగ్ స్టార్‌ అనే బిరుదు కూడా ఇచ్చాడు. అనంత‌రం ఆమె జ‌ర్నీ చూపించ‌డంతో అరియానా ఎమోష‌న‌ల్ అయింది. స‌మాజంలో త‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపునిచ్చార‌ని… తన పిల్లలు.. పిల్లల పిల్లలకు కూడా చూపించుకోవచ్చని ధ‌న్య‌వాదాలు తెలిపింది.

డిసెంబ‌ర్ 20న అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నున్న‌ గ్రాండ్ ఫినాలేను ఇంత‌కు ముందెన్న‌డూ లేనంత గ్రాండ్‌గా ఏర్పాటు చేసేందుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా విజేత‌ను ప్ర‌క‌టించేందుకు స్టార్ హీరోను తీసుకురావడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మొద‌టి సీజ‌న్‌కు హోస్ట్ గా చేసిన యంగ్ టైగ‌ర్‌ జూనియ‌ర్ ఎన్టీఆర్.. అలాగే మెగాస్టార్ చిరంజీవిని కూడా తీసుకురానున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం ఎవరు వస్తారో..?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =