సెలబ్రిటీస్ నుండి అభిమానులు కావచ్చు.. ఇంకెవరైనా కావచ్చో ఎన్నో విషయాల్లో వారి నుండి ఇన్స్పైర్ అయిన వాళ్లు వుంటారు. అలాగే సెలబ్రిటీస్ ను ఇన్స్పైర్ చేసేవాళ్లు.. ఇన్స్పైర్ చేసే సంఘటనలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడు విజయ్ దేవకొండ కూడా అలాంటి ఘటనే ఎదురైంది. అసలు సంగతి ఏంటంటే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులను రౌడీ అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్ కు అమ్మాయిల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే స్వప్నికా అనే అభిమాని విజయ్ పై తన అభిమానాన్ని చూపించగా విజయ్ ఫిదా అయిపోయాడు. స్వప్నికా ఒక దివ్యాంగురాలు.. అయితే ఆమె నోటితోనే కుంచెపట్టి విజయ్ దేవరకొండ చిత్రాన్ని గీశారు. ఇక ఇది సోషల్ మీడియాలో ద్వారా ఫైనల్ గా విజయ్ దేవరకొండ వరకూ చేరింది. దీనితో ఈ వీడియోను విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు… ‘‘లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నికా.. నువ్వు మాకు ఇన్స్పిరేషన్ గా నిలిచావు అని తెలిపారు’’ అని ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ వీడియో నెటిజన్స్ కూడా బాగా ఆకట్టుకుంటుంది.
Sending you lots of love Swapnika.
And taking strength and inspiration from you.
Thank you ❤️ https://t.co/8kzZUijuGT
— Vijay Deverakonda (@TheDeverakonda) December 11, 2020
కాగా ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొద్దిరోజులు షూటింగ్ జరుపుకుంది. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు. మరి ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో… పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: