బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలలో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయికలుగా రాణిస్తూ భారీ పారితోషికాలు అందుకుంటున్న పూజాహెగ్డే, రష్మిక ఇప్పుడు ఒక మూవీ లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. భారీ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో పూజాహెగ్డే , రష్మిక కథానాయికలుగా ఎంపిక అయ్యారు. సాధారణం గా ఒక మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ను , ఒక చిన్న హీరోయిన్ ను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ మూవీ లో ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ కావడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: