హారర్ మూవీ లో కాజల్ అగర్వాల్

Actress Kajal Aggarwal Signs For A Horror Movie In Tamil

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “, “ఇండియన్ 2 “, “హే సినామికా ” (తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మాల్దీవుల్లో హనీ మూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన కాజల్ ఇప్పుడు మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకూ లవ్ , రొమాంటిక్ , సెంటిమెంట్ పాత్రలలో నటించిన కాజల్ ఫస్ట్ టైమ్ ఒక హారర్ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో నలుగురు కథానాయికలతో ఒక తమిళ హారర్ మూవీ తెరకెక్కనుంది . ఒక కథానాయికగా కాజల్ ఎంపిక అయ్యారు. ముగ్గురు కథానాయికలను ఎంపిక చేయాల్సి ఉంది. దర్శకుడు డీకే స్కిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి కాజల్ ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు డీకే , కాజల్ కాంబినేషన్ లో “కవలై వేండామ్ “తమిళ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ ఇప్పుడు ఈ హారర్ మూవీ తో ప్రేక్షకులను భయపెట్టనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =