శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ “తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేద థామస్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో లీన్ లుక్ కై పవన్ కళ్యాణ్ లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారు. “వకీల్ సాబ్ “మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ అదే లుక్ తో మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మూవీ తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. “వకీల్ సాబ్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: