సునీల్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు . సక్సెస్ ఫుల్ మూవీ “అందాలరాముడు ” తో సునీల్ హీరోగా మారి ప్రేక్షకులను అలరించారు. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ , సలోని జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “మర్యాదరామన్న ” (2010 ) మూవీ ఘనవిజయం సాధించింది. “మర్యాద రామన్న “మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. 10 సంవత్సరాల తరువాత మరోసారి సునీల్ , సలోని జంటగా నటించి ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సునీల్ హీరోగా రూపొందిన కొన్ని సినిమాలు విజయం సాధించకపోవడంతో తిరిగి కమెడియన్ గా నటిస్తున్నారు. “కలర్ ఫొటో “మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి సునీల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు సునీల్ హీరోగా సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్నారు. ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో సునీల్ , సలోని జంటగా ఒక మూవీ రూపొందుతుంది. సునీల్ హీరోగా సక్సెస్ ట్రాక్ లోకి వెళ్ళానని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: