“ఫొటో “(2006) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అంజలి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. “ఆనంద భైరవి “, “వకీల్ సాబ్ ” తెలుగు మూవీస్ లో నటిస్తున్న అంజలి రెండు తమిళ మూవీస్ లో కూడా నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఇప్పుడు ఒక కన్నడ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ మిల్టన్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ “శివప్ప”మూవీ రూపొందుతుంది. “హొంగనసు”మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన అంజలి , పునీత్ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన “రాణా విక్రమ”మూవీ లో కథానాయికగా నటించారు. అంజలి ఇప్పుడు “శివప్ప “మూవీ లో శివరాజ్ కుమార్ కు జోడీగా నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఈ రోజు నుండి షూటింగ్ లో జాయిన్ అవుతున్నారని నిర్మాత తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: