‘బంగార్రాజు’ కు కూడా టైమొచ్చింది

Akkinenin Nagarjuna Starrer Bangarraju Movie To Hit The Floors From First Week Of December

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016 విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా తీయాలని గత రెండేళ్ల నుండి ప్లాన్ చేస్తున్నారు కూడా. ఆ మధ్య దాదాపు సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అది కుదరలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో అది ఇంకా లేట్ అయింది. మరోవైపు కళ్యాణ్ కృష్ణ కూడా స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేసుకొని పెట్టుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే టైం వచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం వస్తున్న వార్తలు చూస్తుంటే. డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగును ప్రారంభించి.. దాదాపు సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగును పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో సందడి చేసిన రమ్యకృష్ణ ఈ సీక్వెల్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. చూద్దాం మరి దీనిపై అధికారిక ప్రకటన ఏదైనా వస్తుందేమో.

ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మగా నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్రలో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.