పవన్ చేతుల మీదుగా ‘గమనం’ ట్రైలర్ రిలీజ్

Actress Shriya Saran latest film Gamanam Movie Trailer Is Out

సుజ‌నా రావు దర్శకత్వంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో వస్తున్న సినిమా ‘గ‌మ‌నం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక మూడు విభిన్న కథలతో తెరకెక్కిన ‘గమనం’ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. చెవిటి యువతిగా చంటిబిడ్డతో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్‌ కావాలనుకునే ఓయువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం.. ఇలా మూడు కథలతో గమనం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

అయిదుభాషల్లో ఈ సినిమా రూపొందుతుండటంతో ట్రైలర్‌ను కూడా అయిదు భాషల్లో విడుదల చేశారు. హిందీలో సోనూసూద్‌, తమిళ్‌లో జయం రవి, కన్నడలో శివరాజ్‌ కుమార్‌, మలయాలళంలో ఫహద్‌ ఫసిల్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ముగియగా… ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటుంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్న జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. నిర్మాత అవ‌తారం కూడా ఎత్తి, ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళ‌య‌రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.