బిగ్ బాస్ 4.. అఖిల్-సోహైల్-మెహబూబ్ – దోస్త్ మేరా దోస్త్

Bigg Boss Telugu 4 Latest Episode Highlights: Akhil, Sohail and Mehboob Become Best Friends

మొన్ననామినేషన్స్ తో హీటెక్కిన హౌస్ నిన్న కెప్టెన్సీ టాస్క్ తో వాతావరణం మరింత వేడెక్కింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే ఉదయాన్నే ఎవరి పనిలో వారు ఉండగా బిగ్ బాస్ ఎక్కువ లేట్ చేయకుండా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ వెళ్లిపోవడంతో కెప్టెన్ గా ఎవరూ లేకపోవడంతో బిగ్ బాస్ మళ్లీ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. బాస్కెట్ బాల్స్‌ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవ‌రి బంతిని వాళ్లే కాకుండా మిగ‌తావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు ఆల‌స్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవ‌రి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖ‌రి రౌండ్‌లో గోల్ చేసిన బంతి మీద ఎవ‌రి ముఖం ఉంటే వాళ్లే గెలిచిన‌ట్లు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ గేమ్ లో మోనాల్ బాల్ లాస్య.. లాస్య బాల్ ను మోనాల్ తీసుకుంది.. అరియానా కోసం అవినాష్, అవినాష్ కోసం అరియానా.. అభి కోసం హారిక, హారిక కోసం అభి ఆడగా.. ఇక అఖిల్, సోహైల్, మెహబూబ్ ముగ్గురు ముగ్గురు కోసం ఆడారు. అయితే ఈ ఆటలో ఫైనల్ గా మెహ‌బూబ్‌, అఖిల్, సోహైల్ ముగ్గురే మిగిగిలారు. ఇక సోహైల్ ఒకసారి కెప్టెన్ అవ్వడంతో ఛాన్స్ అఖిల్ కు మెహబూబ్ కు ఇచ్చాడు. ఇక ఇక్కడ అఖిల్ కు, మెహబూబ్ కు పెద్ద డిస్కషనే జరిగింది. కానీ ఇద్దరిలో ఎవరూ తగ్గకపోవడంతో బాధ్య‌తారాహిత్యం కార‌ణంగా ఈ టాస్క్ ర‌ద్దు చేస్తున‌ట్లు వెల్ల‌డించారు. ఈ వారానికి హౌస్‌లో కెప్టెనే ఉండ‌ర‌ని ప్ర‌క‌టించాడు.

దీంతో అన‌వ‌స‌రంగా ఇమ్యూనిటీ రాకుండా చేసుకున్నార‌ని సోహైల్ ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇంట్లో నాకు ఒక్క‌డు స‌పోర్ట్ చేయ‌లేదు. ఈ ఒక్క‌సారి చేయమ‌న్నా.. అందుకే ఈ తొక్క‌లో రిలేష‌న్స్ వ‌ద్దంటా, అంతా న‌టిస్తారు అని అఖిల్ అసహనం వ్యక్తం చేసాడు. మరోవైపు ప్ర‌తిసారి నీ కోసం ఆడ‌తా అని ఎందుకనుకుంటున్నావు అని మోనాల్ ముఖం ప‌ట్టుకుని అడ‌గ్గా నా‌కోసం ఆడ‌మ‌ని నీకు చెప్ప‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోతుందని మెహ‌బూబ్ క‌న్నీళ్లు పెట్టుకోగా మోనాల్, సోహైల్ ఓదార్చారు. అప్ప‌టివ‌ర‌కూ గొడ‌వ‌ప‌డ్డ సోహైల్‌, అఖిల్‌, మెహ‌బూబ్‌ మ‌ళ్లీ ఒక్క‌టైపోయారు.

ఇక అరియానా ద‌గ్గ‌ర మోనాల్ సేఫ్ గేమ్‌ ఆడుతుంద‌ని చెప్పిన అవినాష్‌.. త‌ర్వాత మాత్రం ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి టాప్ 5లో ఉంటావంటూ బిస్కెట్లు వేశాడు. ఇక అర్ధ‌రాత్రి ఇంటిస‌భ్యుల‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ వారి సూట్‌కేసుల‌ను స‌ర్దుకోమ‌న్నాడు. ఫినాలేకు వెళ్ల‌డానికి ఎవ‌రు అడ్డుప‌డుతార‌నుకుంటున్నారో వారి పేర్ల‌ను చెప్ప‌మ‌న్నాడు. మరి ఎవ‌రు ఎవ‌రి పేర్ల‌ను చెప్ప‌నున్నారో ఈ రోజు ఎపిసోడ్ లో తెలియనుంది. చూద్దాం మరి ఈ రోజు ఏం జరుగుతుందో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here