శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ , ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , స్టార్ హీరోయిన్ రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “సరిలేరు నీకెవ్వరు “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు “మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ “ఇవనుక్కు సరియాన ఆలు ఇల్లై ” మూవీ దీపావళి పండగకు రిలీజ్ కానుంది. తమిళ నాడు లో 7 నెలల తరువాత థియేటర్స్ మంగళవారం (నవంబర్ 10 ) నుండి ప్రారంభం అయ్యాయి. అక్కడ ప్రస్తుతం దీపావళి కి కొత్త తమిళ చిత్రాలు రిలీజ్ కావడం లేదు. “ఇవనుక్కు సరియాన ఆలు ఇల్లై ” మూవీని ఎ వి మీడియా కన్సల్టెన్సీ రిలీజ్ చేస్తుంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన “స్పైడర్” మూవీ తో మహేష్ బాబు కోలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: