ఘనంగా జరిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి

Actress Kajal Aggarwal Ties The Knot With Gautam Kitchlu In A Lavish Private Wedding In Mumbai

మొత్తానికి టాలీవుడ్ లో ఒక్కొక్కరూ ఒక్కో ఇంటివారవుతున్నారు. 2020 సినిమాలకు కలిసిరాకపోయినా హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకుల పెళ్లిళ్లకు మాత్రం కలిసొచ్చింది. ఏ ఏడాది జరగనట్టుగా ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ వివాహాలు అవ్వగా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఏలిన కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫైనల్లీ కాజల్ బ్యాచిలర్ జీవితానికి నిన్నటితో ఫుల్‌స్టాప్ పడింది. నిన్న రాత్రి (అక్టోబర్ 300) న ఆమె తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూతో వివాహం జరిగింది. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుని ముంబైలోని ఓ హోటల్‌లో ఆమె వివాహం జరిగింది. నేటితో గౌతమ్‌కిచ్లూ కు భార్యగా మారారు కాజల్‌. కుటుంబసభ్యులు సన్నిహితుల సమక్షంలో కాజల్‌ వివాహం వైభవంగా జరిగింది. వేడుకలో కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.

కాగా కాజల్ – గౌతమ్ కిచ్లూ ఇద్దరూ చిన్నటినుండి స్నేహితులే అని తెలుస్తుంది. కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లోనే ఇద్దరూ చదువుకున్నారట. ఆ తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో.. ఆ తర్వాత ఇన్ సీడ్‌లో చదువుకున్నారని తెలుస్తుంది. ఇక కాజల్ హీరోయిన్ గా తన కెరీర్ ను మలుచుకోగా గౌతమ్ బిజినెస్ మెన్ గా మంచి స్థాయిలో వున్నాడు. గౌతమ్ కిచ్లు డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోని నిర్వహిస్తున్నాడు.

కాగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2ల‌లో న‌టిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + five =