సాంఘిక , జానపద , పౌరాణిక , చారిత్రాత్మక ఏ జానర్ మూవీలో నైనా తన పాత్రను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో బాలకృష్ణ “దానవీర శూర కర్ణ ” మూవీ లో అభిమన్యుడు , “బ్రహ్మర్షి విశ్వామిత్ర” లో హరిశ్చంద్రుడు , “ఆదిత్య 369 “లో కృష్ణదేవరాయలు , “భైరవ ద్వీపం “లో రాజ వంశస్థుడు , “శ్రీకృష్ణ విజయం” లో కృష్ణుడు , అర్జునుడు , “శ్రీరామ రాజ్యం “లో శ్రీరాముడు , “గౌతమి పుత్ర శాతకర్ణి “లో శాతకర్ణి గా ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ ఇప్పుడు కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమ దేవి కాలం నాటి వర్ధమానపురం ను పరిపాలించిన గోన గన్నారెడ్డి పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న “BB3” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత బాలకృష్ణ చారిత్రాత్మక చిత్రం గోన గన్నారెడ్డి గా నటించడానికి డిసైడ్ అయ్యారని , గోన గన్నారెడ్డికి సంబంధించిన వివరాలు తక్కువగా అందుబాటులో ఉండడం తో స్క్రిప్ట్ వర్క్ కై బాలకృష్ణ కొందరు రచయితలు , పరిశోధకుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన “రుద్రమ దేవి “మూవీ లో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: