సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ రిలీజ్

Actor Sudheer Babu Reveals Motion Poster Of His Latest Movie Sridevi Soda Center On Twitter

పలాస 1978 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ క‌రుణ కుమార్. ఈ సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం దక్కించుకున్నాడు. ఇప్పుడు సుధీర్ బాబు.. కరుణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను ఇప్పటికే విడుదల చేయగా తాజాగా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘శ్రీదేవి సోడా సెంటర్’ లో అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు లైటింగ్ సూరి బాబు అనే పాత్రలో నటిస్తున్నాడు. మోష‌న్ పోస్ట‌ర్‌లో సుధీర్ బాబు సోడా ప‌ట్టుకొని ఉన్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. డెక‌రేష‌న్ లైట్స్‌, సోడా బాటిల్స్‌, మ‌ల్లె పూలు క‌నిపిస్తుండ‌గా సుధీర్ బాబు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టే కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌లు విజయ్ చిల్లా, శశిదేవి‌రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెం 4గా ఈ చిత్రం తెరకెక్కనుంది. గతంలో ‘భ‌లే మంచి రోజు’ సినిమా ఇదే బ్యానర్ లో చేసాడు. దాదాపు అయిదేళ్లు తరువాత‌ సుధీర్ బాబు ఈ బ్యాన‌ర్‌లో చిత్రం చేస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు.

 

కాగా ఇటీవలే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేష‌న్ లో వ‌చ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటివరకూ కాస్త ల‌వ‌ర్ బాయ్ రోల్స్ లో క‌నిపించిన సుధీర్ బాబుకు ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హీరోగా మారడానికి బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. చూద్దాం మరి ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా సుధీర్ బాబుకు ఎంత సక్సెస్ అందిస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =