సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ K చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. సూపర్ హిట్ మలయాళ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” కు తెలుగు రీమేక్ గా రూపొందనుంది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. “గబ్బర్ సింగ్ “, సర్దార్ గబ్బర్ సింగ్” వంటి మూవీస్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అయ్యప్పనుమ్ కోషియమ్ ” కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ కు జోడీ గా సాయి పల్లవిని ఎంపిక చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి గ్లామరస్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య “లవ్ స్టోరీ “, రానా దగ్గుబాటి
“విరాటపర్వం “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. నాని హీరోగా రూపొందనున్న “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో సాయి పల్లవి కథానాయికగా ఎంపిక అయ్యారు. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ , టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి నటించే ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనడం లో సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: