డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా వుంటాయో తెలుసు. అంతేకాదు.. సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో కూడా దిట్ట. గతంలో బాలకృష్ణ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్ కూడా చాలా తొందరగా పూర్తి చేసి అందరూ షాక్ అయ్యేలా చేసాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి షాకే ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలైపోయింది. సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారమే గత కొద్దిరోజులుగా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక చెప్పినట్టే చేసి చూపించాడు క్రిష్. కరోనా, భారీ వర్షాలు వంటి వాటిని లెక్క చేయకుండా టాకీ భాగం మొత్తాన్ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేశారు. ఇంకో ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది. దీని చిత్రీకరణ మరో ఐదు రోజుల్లో పూర్తి కాబోతోందని తెలుస్తోంది. మరి కరోనా పరిస్థితుల్లో కూడా ఇంత తొందరగా సినిమాను కంప్లీట్ చేయడం అంటే గొప్ప విషయమే.
కాగా, ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ఇందులో రకుల్ గిరిజన యువతిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది.
ఇక క్రిష్ పవన్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకా టైం పడుతుంది. దీనితో ఈ గ్యాప్ లో ఈ సినిమా పూర్తి చేయాలన్న ప్లాన్ వేసాడు. ఇప్పుడు ఆ ప్లాన్ సక్సెస్ ఫుల్ గా వర్క్ అవుట్ అయిందనే చెప్పొచ్చు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: