కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ లకు దూరంగా ఉండగా.. ఇప్పుడు అలా షూటింగ్ మొదలుపెడుతున్నారో లేదో షూటింగ్ ను పూర్తి చేసేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. సినిమా రిలీజ్ సంగతి తర్వాత ముందు సినిమా పూర్తి అయితే తర్వాత రిలీజ్ సంగతి ఆలోచించొచ్చు అన్న ప్లాన్ లో ఉన్నారు. ఇక ఇప్పటీకే పలువురు హీరోలు షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు తాజాగా సుశాంత్ కూడా తన సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుశాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే హైదరాబాద్‌లో మళ్లీ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఈ సందర్భంగా తన టీంకు థ్యాంక్స్ చెప్పాడు.
When the hashtag# isn’t where it’s supposed to be.. 😂☺️
The cake made up for it though!
Thank you Team #IVNR 🤗#NoParking
IchataVahanamuluNilupaRadu pic.twitter.com/XI9cr7Objh— Sushanth A (@iamSushanthA) October 24, 2020
కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: