మరి కొద్దిరోజుల్లో కాజల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను కాజల్ పెళ్లి చేసుకోబోతుంది. అక్టోబర్ 30న పెళ్లి పెళ్ళి కి ముహూర్తం పెట్టారు. అయితే ప్రస్తుతం కరోనా కాబట్టి పెద్ద హడావుడి లేకుండా సింపుల్ గానే కానిచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఇరు కుటుంబసభ్యులతో పాటు చాలా కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఒకపక్క పెళ్లి పనులు చూసుకుంటూనే మరోవైపు సొంత ఇంటి ఏర్పాట్లలో వున్నారు ఈ జంట. తమ కొత్త ఇంటి పనులు జరుగుతున్నాయని కాజల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. అంతేకాదు ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని అభిమానులను సరదాగా అడిగింది కూడా. మరి కాబోయే భర్తే పెద్ద ఇంటీరియర్ డిజైనర్.. ఇంకేం సలహాలు ఇస్తాం..
కాగా నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2లలో నటిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: