కరోనా వల్ల సినిమా థియేటర్స్ మూత పడగా ఎన్నో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. అయితే ఈ మధ్యే థియేటర్స్ 50 శాతం ఆక్యూపెన్సీ తో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినా ఇక్కడ మాత్రం ఇంకా సరిగా ఓపెన్ చేయడానికి ముందుకు రావట్లేదు థియేటర్ల యాజమాన్యం. మరో రెండుమూడు నెలలు అయితే కానీ థియేటర్స్ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. అందుకే తన సినిమా రిలీజ్ ను వచ్చే ఏడాదికి ఫిక్స్ చేసాడు రానా. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే అరణ్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్నఈ సినిమా కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను చెప్పాడు రానా. తన ట్విట్టర్ ద్వారా.. నిరీక్షణ ముగిసింది… 2021 సంక్రాంతికి అరణ్య చిత్రం రిలీజ్ అవుతోందని రానా స్వయంగా వెల్లడించాడు.
The wait is over #Aranya at a theatre near you Sankranti 2021!! pic.twitter.com/8gndLg3Tyh
— Rana Daggubati (@RanaDaggubati) October 21, 2020
ఇక ఈ సినిమాలో రానా బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో.. పెరిగిన గడ్డం, గ్రే హెయిర్, పైకి వంచిన భుజంతో డిఫరెంట్ ఆ కనిపించనున్నాడు. మరి బాహుబలి కంటే ఈ సినిమాకే ఎక్కువ కష్టపడ్డానని రానా ఇప్పటికే చెప్పాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: