సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే ముందు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ముందు కానిచ్చేస్తున్నారు ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర యూనిట్. సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేయగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ తన ట్విట్టర్ లో తెలిపింది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసిందని.. ‘‘అతి త్వరలో మీ ముందుకు..’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. మరి సినిమా థియేటర్ లో రిలీజ్ చేస్తారా? లేదా? ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Censored with a clean ‘U’ 🤘. All set for a grand Release Soon!#SoloBrathukeSoBetter@IamSaiDharamTej @NabhaNatesh @MusicThaman @subbucinema @SVCCofficial @BvsnP @SonyMusicSouth pic.twitter.com/sUFbV1Gmog
— SVCC (@SVCCofficial) October 21, 2020
కాగా `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
నిజానికి ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది. కాకపోతే, కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్డౌన్ కారణంగా ఆలస్యమైంది. ఇటీవలే షూటింగ్ ను మొదలుపెట్టి నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సింగిల్ షెడ్యూల్లో మిగిలిన భాగాన్ని, పాటలను చిత్రీకరించారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘అమృత’ అనే సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: