నేను పూర్తిగా కోలుకున్నా – మీ అందరి వల్లే సాధ్యమైంది

Sanjay Dutt Took To Instagram To Share His Happiness As He Got Completely Recovered From Cancer

సంజయ్ దత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆయనకు ఇటీవలే లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. ఈ నేపథ్యంలో గతకొద్ది కాలంగా చికిత్స తీసుకుంటున్నారు కూడా. ఇక క్యాన్సర్ పై సంజూ భాయ్ విజయం సాధించినట్టే తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్ని వారాలుగా నేను, నా కుటుంబం కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. భరించేవాడికే బాధలు ఇస్తాడని కొందరు చెబుతుంటారు కదా.. అది నిజమే. ఈ రోజు నా పిల్లల బర్త్ డే. ఈ సందర్భంగా మీ అందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నాను. నేను పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చాను. ఇదే నా పిల్లలకు నేను ఇవ్వగలిగే గొప్ప బహుమతి. మీ అందరి మద్దతు, ఆశీర్వాదం లేకపోతే ఇది జరిగేది కాదు. ఇలాంటి కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచిన నా ఫ్యామిలీకి, అభిమానులకు రుణపడి ఉంటాను. కోకిలాబెన్ హాస్పిటల్‌ డా. సేవంతి, ఆమె వైద్య బృందానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాన`ని సంజయ్ పేర్కొన్నారు.

 

 

View this post on Instagram

 

My heart is filled with gratitude as I share this news with all of you today. Thank you 🙏🏻

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

ఇక ఇదిలా ఉండగా ఒక పక్క చికిత్స తీసుకుంటూనే సంజూ భాయ్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. సంజయ్ దత్‌ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీర పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మేకోవర్ పనిలో పడ్డాడు. నవంబర్ నుండి షూటింగ్ లో పాల్గొననున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.