వరద భాదితుల కోసం ముందుకొచ్చిన ‘తెలుగు సినీ ప్రముఖులు’

Tollywood Film Fraternity Once Again Comes Forward To Help Hyderabad Flood Victims

కరోనా వల్ల ఇప్పటికే ప్రపంచం అతలాకుతలమైపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త సాధారణ పరిస్థితులు వస్తున్నాయి కదా అని అనుకునేలోపు మళ్లీ మరో సమస్య వచ్చి పడింది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు. ఏపీలో కాస్త బెటరే కానీ.. భారీ వ‌ర్షాల‌తో భాగ్య‌న‌గ‌రం వ‌ణికిపోతుంది. గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో అనేక కాల‌నీలు జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇక ఏ ఆపద వచ్చినా మన సినీ ప్రముఖులు ఎప్పుడు ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నేపథ్యంలో మన సెలబ్రిటీస్ అందరూ ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయగా ఇప్పుడు వరదలతో చిక్కుల్లో పడ్డ హైద్రాబాద్ వాసులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే వారిని ఆదుకునేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌క్ష‌ణ సాయం కింద రూ. 550 కోట్లు విడుద‌ల చేశారు. బాధితుల‌ని ఆదుకునేందుకు ప‌‌లువురు ముందుకు రావాల‌ని కేసీఆర్ కోర‌గా తెలుగు ఇండస్ట్రీ నుండి అనేకమంది విరాళాలు అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో భాగంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చిరంజీవి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. గడచిన వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షం వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 1కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం చేయమని సంధర్భంగా కోరుతున్నానని చిరు తెలిపారు.

 

ఈ నేపథ్యంలో “హైదరాబాద్‌లోని భారీ వర్షాల కారణంగా సామాన్యులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.550 కోట్ల విడుదల చేయడం మంచి పరిణామం. నా వంతుగా రూ.50 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందిస్తున్నాను” అన్నారు నాగార్జున.

 

సూపర్ స్టార్ మహేష్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. హైద్రాబాద్ భాదితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి సాయం చేసినందుకు ధన్యవాదాలు. నా వంతుగా నేను 1కోటి రూపాయలు విరాళం అందిస్తున్నాను. ఇలాంటి కష్టకాలంలో మనవాళ్లకు తోడుగా ఉండాలని… ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఎవరికి తోచినంత సాయం వారు చేయాలని పిలుపు నిచ్చారు.

 

మరోవైపు హీరో విజయ్‌ దేవరకొండ పది లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నానని తెలిపారు. కేరళ, చెన్నై వరదలప్పుడు ఆర్మీ కోసం ఇటీవల కరోనా టైంలో మనందరం ఒక్కటయ్యాం.. ఇప్ప్పుడు మన సినీ మన వాళ్ల కోసం ఒకటవ్వాలని.. బాధితులకోసం సాయం చేయాలని ట్వీట్ చేసాడు.

 

జూనియర్ ఎన్టీఆర్ మన హైదరాబాదు నగర పునరుద్ధరణ కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు. ఈ ఆపద సమయంలో అందరం రంగంలోకి దిగి హైదరాబాదు నగర పునర్నిర్మాణంలో పాలుపంచుకుందామని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.

 

హారిక హాసిని బ్యానర్‌తో పాటు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కలిసి తలో పది లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు.

డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి కూడా తన వంతు ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయలను అందించనున్నట్లు తెలిపారు. నేను ఉంటున్న నా సిటీ నా కళ్ల ముందే భారీ వర్షం వల్ల వచ్చిన వరదలతో చిక్కుకుపోయింది.. ఈ సమయంలో వరద భాదితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో నావంతుగా 5 లక్షల సాయం అందిస్తున్నానని తెలిపాడు.

 

అలాగే డైరెక్టర్ హరీశ్ శంకర్ ఐదు లక్షల రూపాయలను, బండ్ల గణేష్ రూ.5లక్షల విరాళాన్ని అందించారు.

 

 

యంగ్ హీరో రామ్ కూడా . తన వంతుగా రూ.25 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించాడు. `నా తెలంగాణ ప్రజల గురించి చాలా అందోళన చెందుతున్నాను. తొలి రోజు నుంచి క్షేత్ర స్థాయిలో ఎంతో కష్టపడుతూ మంత్రి కేటీఆర్ ప్రజలకు అండగా నిలవడం చాలా గొప్ప విషయం. నా వంతుగా రూ.25 లక్షలు సహాయం చేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాన`ని రామ్ ట్వీట్ చేశాడు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 4 =