దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “రాధేశ్యామ్ ” మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది. ఇటలీ లో షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ .. చిన్న సెట్ లో తక్కువ టీమ్ మెంబర్స్ తో కరోనా వైరస్ జాగ్రత్తలతో షూటింగ్ జరుగుతుందనీ , కెమెరా ముందు మాస్క్ తీయాలి కాబట్టి తప్పకుండా కొంత రిస్క్ ఉంటుందనీ , లైఫ్ కొనసాగించాలంటే కొత్త జీవన శైలి కి అలవాటుపడాలనీ , తొలి రెండు రోజులు భయమనిపించినా ఇప్పుడు అంతా ఓకే ననీ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటలీ లో షూటింగ్ లో పాల్గొన్న పూజాహెగ్డే ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ చెట్ల లో తిరుగుతున్న వన్యప్రాణి ఉడత కు నట్స్ తినిపించి తన బూతదయను చాటుకున్నారు. ఉడత కు భయపడి నట్స్ తినిపించడానికి నాలుగు సార్లు ఫెయిల్ అయ్యాననీ , 5 వ సారి ఉడతకు నట్స్ తినిపించడం ఆనందంగా ఉందనీ , ఒక వీడియో క్లిప్ ను పూజాహెగ్డే ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. “రాధేశ్యామ్ ” మూవీ తో పాటు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ లో నటిస్తున్న పూజాహెగ్డే రెండు బాలీవుడ్ భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజాహెగ్డే హీరోయిన్ గా మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: